జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతున్నప్పటికీ, 2026, 2027 సంవత్సరాలకు సంబంధించిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతోంది. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో 2026లో ఎన్నికలు జరుగనున్నాయి. గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 2027లో ఎన్నికలు ఉండటంతో జమిలి ఎన్నికల ప్రణాళికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.