ఇరాన్ యుద్ధ భయంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. ధరలు పడిపోతాయనే భయంతో రొయ్యలను హడావుడిగా అమ్మెస్తున్నారు. దళారులు ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్లోకి అధిక దిగుబడి రావడంతో నిల్వ సమస్యలు తలెత్తాయి. భవిష్యత్తులో మంచి ధర లభిస్తుందని, తొందరపడి పంటలు పండించవద్దని రైతు సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.