బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది శుక్రవారం ఒడిస్సా-ఉత్తర ఆంధ్ర కోస్తా తీరం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. విశాఖ వాతావరణ శాఖ కోస్తాంధ్రకు వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గోపాల్పూర్, పారాదీప్ తీరాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది.