విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో జూనియర్ దళపతి అనే నీటి ఏనుగుకు శుక్రవారం ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిగాయి. సందర్శకులు, జూ సిబ్బంది కలిసి హిప్పోకు ఇష్టమైన పుచ్చకాయలతో ట్రీట్ ఇచ్చారు. కేక్ కట్ చేసి "హ్యాపీ బర్త్ డే" పాట పాడారు. ఎనిమిదేళ్లుగా సందర్శకులను అలరిస్తున్న ఈ హిప్పో పుట్టినరోజు వేడుకలు ఆనందంగా ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.