పుచ్చకాయ సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అందుకే దీనిని ఎక్కువగా వేసవిలో తింటుంటారు. కానీ ఫ్రిడ్జ్ లో ఉంచిన పుచ్చకాయ మరింత చల్లగా మారిపోతుంది. దీన్ని తిన్న వెంటనే కొందరికి దగ్గు, జలుబు, గొంతు సమస్యలు రావచ్చు. ముఖ్యంగా రాత్రిపూట చల్లటి పుచ్చకాయ తింటే జీర్ణక్రియ మందగించి అజీర్ణ సమస్యలు వస్తాయి.