వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికుడు రఘు తన నిజాయితీని చాటుకున్నాడు. రాంపూరు, మడికొండల మధ్య కాలువ శుభ్రం చేస్తుండగా ఆరు లక్షల విలువైన రెండు బంగారు గాజులు లభించాయి. వాటిని వెంటనే వరంగల్ మున్సిపల్ కమిషనర్ ద్వారా పోలీసులకు అప్పగించాడు. పోలీసులు ప్రస్తుతం అసలు యజమానుల కోసం గాలిస్తున్నారు.