వరంగల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య కార్మికుడు రఘు వరదల వల్ల కొట్టుకొచ్చిన బురద, వ్యర్థాలను శుభ్రం చేస్తున్నప్పుడు సుమారు ఆరు లక్షల రూపాయల విలువైన బంగారు గాజులు దొరికాయి. వాటిని తీసుకెళ్లి తన పై అధికారులకు అప్పగించి రఘు గొప్ప చిత్తశుద్ధిని ప్రదర్శించారు. సరైన ఆధారాలతో వచ్చిన వారికి గాజులు తిరిగి ఇస్తామని మున్సిపల్ అధికారులు, పోలీసులు తెలిపారు.