వరంగల్ మోడల్ బస్టాండ్ ప్రాంగణం చెరువును తలపించడంతో బీజేపీ నేతలు పడవలతో నిరసన తెలిపారు. బస్టాండ్ నిర్మాణంలో భాగంగా కాంట్రాక్టర్ మట్టి తవ్వకాలు జరిపి పనులను రెండేళ్లుగా నిలిపివేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు నేతృత్వంలో ఈ నిరసన జరిగింది.