వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బొలేరో వాహనం ప్రమాదానికి గురైంది. కొబ్బరికాయలతో వెళుతున్న బొలేరో లారీ ఢీకొనడంతో బోల్తా పడింది. కొబ్బరికాయలు రోడ్డుపై పడిపోగా, స్థానికులు వాటిని దోచుకున్నారు. వాహన డ్రైవర్ లేదా లోడ్ యజమాని గురించి ఎటువంటి సమాచారం లేదు. ప్రమాదం తీవ్రతను పక్కన పెట్టి, ప్రజలు తమకు దొరికినన్ని కొబ్బరికాయలు పట్టుకెళ్లారు.