తాజా పరిశోధనల ప్రకారం.. రోజువారీ నడక, ఇంటి పనులు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 7000 అడుగులు నడిచే వారిలో 11%, 9000 అడుగులు నడిచే వారిలో 16% వరకు క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని తెలిసింది. రోజూ చురుకుగా ఉండటం, ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించడం చాలా ముఖ్యం.