విజయనగరం జిల్లా వంగరలోని ఎమ్మార్వో రమణరావు తాగిన మత్తులో విధులు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. సిబ్బంది ఆయనను గమనించి ఆఫీసుకు తాళం వేశారు. తాగిన మత్తులో విధులకు వచ్చిన ఎమ్మార్వోపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కలెక్టర్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.