విజయనగరం జిల్లాలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తన మొబైల్ ఫోన్ లాక్కుందని కోపగించుకున్న ఓ విద్యార్థిని, లెక్చరర్‌ను చెప్పుతో కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థిని, లెక్చరర్ మధ్య వాగ్వాదం తీవ్రతరమై దాడికి దారితీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.