ఆహారంతో సంబంధం లేకుండా శరీరం గ్రహించే విటమిన్ డి లోపం అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధకశక్తికి కీలకమైనది. అయితే, విటమిన్ డి మోతాదు ఎక్కువైనా హైపర్ కాల్షిమియా, కిడ్నీల్లో రాళ్లు వంటి తీవ్రమైన నష్టాలు సంభవిస్తాయి. నిపుణుల సలహా మేరకు సప్లిమెంట్స్ వాడాలి.