విశాఖపట్నం ఆర్కే బీచ్లో సముద్ర కెరటాలు అనూహ్యంగా ఉద్ధృతమయ్యాయి. మూడు మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. తెల్లవారుజామున సంభవించిన భూ ప్రకంపనల ప్రభావం వల్లే ఈ మార్పులు చోటుచేసుకున్నాయని జియాలజీ నిపుణులు భావిస్తున్నారు. పర్యాటకులు సముద్రంలోకి వెళ్లవద్దని తీరప్రాంత సిబ్బంది హెచ్చరించారు.