విశాఖపట్నంలోని గాజువాకలో దారుణం చోటుచేసుకుంది. నేవీ టెక్నీషియన్ రవీంద్ర తన ప్రియురాలు మోనికను హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్లో దాచాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ ఘాతుకం జరిగింది. పెళ్లి చేసుకోమని, డబ్బులు డిమాండ్ చేయడంతోనే హత్య చేసినట్లు నిందితుడు రవీంద్ర పోలీసుల విచారణలో వెల్లడించాడు.