సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటాడు అల్లు అర్జున్. బన్నీ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. భార్య స్నేహ, కుమారుడు అయాన్, కూతురు అర్హతో కలిసి ఓ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లాడు. కుటుంబంతో కలిసి భోజనం చేసి బయటకు వస్తుండగా మీడియా వారి ఫోటోలు క్లిక్‌మనిపించే పనిలో పడింది.