విజయవాడలోని చౌకీ సెంటర్లో లేడీ గ్యాంగ్ అర్ధరాత్రి దొంగతనాలకు పాల్పడుతోంది. వరుస చోరీల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఫిర్యాదు అందుకున్న వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.