విజయకీలాద్రిపై భక్తకోటి ఎదురుచూసిన ఆంజనేయస్వామి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. 45 అడుగుల మందిరంలో 27 అడుగుల భారీ శిలామూర్తిగా విఘ్నవిమోచక హనుమంతుడు కొలువుదీరాడు. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి అమృత హస్తాల మీదుగా శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో అసంఖ్యాకంగా భక్తులు పాల్గొని హనుమ నామస్మరణ చేశారు.