ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుకి సెంటిమెంట్ పరంగా ఎనిమిది నెంబర్‌పై విశ్వాసం ఎక్కువ. తెలుగు, ఇంగ్లీష్ పేర్లలోని అక్షరాల సంఖ్యను కూడితే ఎనిమిది వస్తుందని, ఆయనకు పేరు తెచ్చిన సినిమాల విడుదల తేదీలు కూడా ఎనిమిదితో ముడిపడి ఉంటాయని, ఫిలింనగర్‌లోని ఆయన ఇంటి రోడ్ నెంబర్ కూడా ఎనిమిదేనని ఆయన చెప్పుకునేవారు.