వారణాసి నగరం ప్రపంచంలోనే రెండవ శాఖాహార నగరంగా మారనుందా? కాశీ పవిత్రత, పరిశుభ్రత కోసం నగరంలోని దాదాపు 350-400 మాంసాహార దుకాణాలను శివార్లకు తరలించాలని వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. ఆరు నెలల్లోగా దీపావళి కల్లా ఈ నిర్ణయం అమలుకానుంది. దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.