త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇంద్రఘర్ కోటా సెక్షన్లో జరిగిన ట్రయల్ రన్లో గంటకు 180 కి.మీ వేగంతో దూసుకెళ్తున్న రైలులో నిర్వహించిన వాటర్ టెస్ట్ వీడియో వైరల్ అయింది. గ్లాసుల్లో నీరు ఏ మాత్రం తొణకకపోవడంతో రైలు స్థిరత్వం రుజువైంది. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ, ప్రయాణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.