విజయవాడ జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్‌తో వెళుతున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన కూల్ డ్రింక్స్ కేసులను స్థానికులు, వాహనదారులు ఎత్తుకెళ్లారు. ఘటన విజయవాడ-మచిలీపట్నం రహదారిపై చోటుచేసుకుంది.