గుజరాత్లోని వడోదరాలో ఒక మహిళ రూ.20లకు పానీపూరి కొనుగోలు చేసింది. సహజంగా రూ.20కి ఆరు పానీ పూరీలు ఇవ్వాల్సి ఉండగా.. దుకాణదారుడు నాలుగు మాత్రమే ఇచ్చాడు. రెండు పానీపూరీలు తక్కువ ఇవ్వడంతో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె రోడ్డుపై ధర్నా చేసింది. పోలీసులు జోక్యం చేసుకుని విషయాన్ని పరిష్కరించారు.