విశాఖపట్నం వడ్లపూడి ప్రాంతంలోని ఓ ఇంట్లో భారీ కొండచిలువలు కలకలం సృష్టించాయి. స్టోర్‌రూమ్‌లో వస్తువులు పెట్టడానికి వెళ్ళిన కుటుంబ సభ్యులకు పది, పన్నెండు అడుగుల పొడవున్న రెండు కొండచిలువలు దర్శనమిచ్చాయి. సమాచారం అందుకున్న స్నేక్‌క్యాచర్ నాగరాజు అప్రమత్తంగా వ్యవహరించి వాటిని సురక్షితంగా బంధించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.