తన కొత్త చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా వడ్డే నవీన్ బాహుబలి కంటే పుష్ప సినిమానే ఎక్కువ సంచలనం సృష్టించిందని అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్ ఎదుగుదల, అతని ఇమేజ్ జాతీయ స్థాయికి చేరుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని నవీన్ అన్నారు. బాహుబలి విజయం ఊహించిందేనని, కానీ పుష్ప విజయం మాత్రం అనూహ్యమని ఆయన పేర్కొన్నారు.