కర్ణాటకలోని కళబురుగిలోని నగల దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. దుండగులు మూడు కిలోల బంగారం, ఐదు లక్షల నగదు దోచుకెళ్లారు. అయితే దొంగతనం జరిగిన 14 రోజుల తర్వాత దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. దొంగతనం తర్వాత, ఒక దొంగ వడపావ్ సెంటర్లో 30 రూపాయల బిల్లు కట్టడం ద్వారా పోలీసులు వారిని గుర్తించారు.