ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వ్యసనం, దాని వల్ల కలిగే డిప్రెషన్, ఏకాగ్రత లోపం, నిద్రలేమి వంటి సమస్యలను నివారించేందుకు నెల రోజుల క్రితం ఈ నిషేధం విధించింది. దీంతో నెల రోజుల వ్యవధిలో 47 లక్షల సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసింది. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంపై ఇతర దేశాలు, తల్లిదండ్రులు ప్రశంసలు కురిపిస్తున్నారు.