అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశానికి కుటుంబ సమేతంగా వచ్చారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వారికి స్వాగతం పలికారు. త్రివిధ దళాల సైనిక వందనం స్వీకరించారు. ప్రధానమంత్రి మోడీతో సమావేశమై ఆర్థిక, వాణిజ్య, భౌగోళిక సంబంధాలపై చర్చించనున్నారు. అమెరికా టారిఫ్‌లపైనా చర్చ జరగవచ్చు. మోడీ వారికి విందు ఇవ్వనున్నారు. నాలుగు రోజుల పర్యటనలో ఢిల్లీ, యూపీ, రాజస్థాన్‌లను సందర్శించనున్నారు.