యూపీఐ ఛార్జీల పెంపుతో నగదు లావాదేవీలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. 80లు, 90ల నాటి పరిస్థితి పునరావృతం అవుతుందా అని చాలా మంది సందేహిస్తున్నారు. ఈ ఛార్జీలు ముఖ్యంగా చిన్న వ్యాపారులను, మధ్యతరగతి వర్గాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇప్పటికే పలు పన్నులతో ఇబ్బంది పడుతున్న వీరు, ఛార్జీల భారం తగ్గించుకోవడానికి నగదు లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్నారు.