అయ్యప్ప మాలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కడపలోని అజ్మీర్ దర్గాను సందర్శించడంపై వివాదం రేగింది. అయ్యప్ప మాలధారణలో దర్గాకు ఎలా వెళ్తారంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఉపాసన తన భర్తను విమర్శిస్తున్న వారిపై సీరియస్ అయ్యారు.