తెలంగాణ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు కీలక పదవి ఇచ్చింది. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-చైర్మన్గా ఉపాసనను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఉపాసన తన కృతజ్ఞతలు తెలిపారు.