ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో అవధేష్ రాణా అనే వరుడు రూ. 31 లక్షల భారీ కట్నాన్ని సున్నితంగా తిరస్కరించి ఆదర్శంగా నిలిచాడు. తన మామ కష్టార్జితాన్ని తీసుకోలేనని చెప్పి, కేవలం రూపాయి శుభశకునం మాత్రమే స్వీకరించాడు. నవంబర్ 22న అదితి సింగ్‌తో అతని వివాహం జరిగింది. ఈ చర్య సమాజానికి బలమైన సందేశాన్నిచ్చింది.