సీమ చింతకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మధుమేహం, గుండెజబ్బులు, ఒత్తిడి వంటి సమస్యల నివారణలోనూ సీమ చింతకాయలు ఉపయోగపడతాయి. వీటిని తరచూ వాడటం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.