సాధారణ ఉప్పు కంటే ఎన్నో రెట్లు ఖరీదైన కొరియన్ పర్పుల్ సాల్ట్ ప్రత్యేక తయారీ విధానం కలిగి ఉంది. వెదురు బొంగుల్లో 800 డిగ్రీల వద్ద తొమ్మిదిసార్లు వేడిచేసి తయారుచేసే ఈ ఉప్పు, క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించడంతో పాటు జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందని కొరియన్ నిపుణులు చెబుతున్నారు.