కర్నూలు జిల్లా గోనేగండ్ల మండలంలో పట్టపగలు జరిగిన దొంగతనం సంచలనం సృష్టించింది. రైతు ఉస్మాన్ ఇంటి నుండి లక్షన్నర రూపాయలు, బంగారం, వెండి నగలు దొంగిలించారు. విశేషం ఏమిటంటే, దొంగలు ఇంట్లో బండలపై కొబ్బరినూనె చల్లి, ఆధారాలను తుడిచిపెట్టుకుని పరారయ్యారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.