విటమిన్ డి సహజంగా సూర్యరశ్మి నుండి లభిస్తుంది. ఆధునిక జీవనశైలి కారణంగా 70% మందికి విటమిన్ డి లోపం ఉంది. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య అరగంట సూర్యరశ్మిలో గడపడం లేదా మాంసం, గుడ్లు, చేపలు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా తగినంత విటమిన్ డి పొందవచ్చు.