శీతాకాలంలో అంజీర్ పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ, కేశ సంరక్షణకు తోడ్పడతాయి. తక్కువ క్యాలరీలతో పోషకాల గని అంజీర్.