పండ్లు కేవలం రుచిని మాత్రమే కాదు, శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి వ్యాధుల నుండి కాపాడతాయి. పుచ్చకాయ డీహైడ్రేషన్ తగ్గిస్తే, అరటిపండు తక్షణ శక్తినిస్తుంది. అవకాడో కండరాల తిమ్మిరిని నివారిస్తుంది. ప్రతి పండులోనూ ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.