అంబేద్కర్ కోనసీమ జిల్లా బి. దొడ్డవరంకు చెందిన బోలిశెట్టి తరుణ్ కుమార్, పెండ్లికొడుకు తన వివాహానికి ఎడ్లబండ్ల ఊరేగింపుతో మండపానికి చేరుకున్నారు. మర్చిపోయిన పాత సంప్రదాయాన్ని, బ్యాండ్ బాజాలతో కూడిన కొత్త ట్రెండ్‌ను కలిపి, అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వినూత్న పెళ్లి ఊరేగింపును బంధువులు, గ్రామస్థులు ప్రశంసించారు.