కరోనా తర్వాత ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగినప్పటికీ, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి భారతదేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఎస్ఏమ్స్ నివేదిక ప్రకారం 30% మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. నిశ్చల జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణాలు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.