గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 23 ఏళ్లుగా ఒక కొండముచ్చు కోతులను నియంత్రించే పనిలో ఉంది. విశ్వవిద్యాలయంలోని కోతుల సమస్యను అరికట్టడానికి ఈ కొండముచ్చును ప్రత్యేకంగా నియమించారు. 200 ఎకరాల విశాలమైన క్యాంపస్లో కోతులను దూరంగా ఉంచడంలో ఇది సహాయపడుతోంది.