పసుపు, అల్లం రెండూ ఒకే జాతికి చెందినవి. ఈ రెండూ అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఆయుర్వేద నిపుణులు ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి పెరుగుదల, హృదయ సంబంధిత సమస్యల నివారణ, రక్తపోటు నియంత్రణ, కొలెస్ట్రాల్ నియంత్రణ వంటివి ఈ మిశ్రమం వల్ల కలుగుతాయి.