ట్యూనా చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. బరువు నియంత్రణ, మెదడు, కంటి ఆరోగ్యం మెరుగుపడటానికి ట్యూనా చేపలు సహాయపడతాయి. అయితే, అధికంగా తీసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు కాబట్టి మితంగా తినడం మంచిది.