తులసి ముక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముక్క గురించి దాదాపు అందరికీ తెలుసు. ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి కచ్చితంగా ఉండాల్సిందే. ఎన్నో వ్యాధులు దరి చేరకుండా చేయడంలో తులసి మొక్క ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఆయుర్వేద పరంగా కూడా ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.