ఉదయం పరగడుపున రెండు తులసి ఆకులు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గించడం, రోగ నిరోధక శక్తిని పెంచడం, శ్వాసకోశ సమస్యలను తగ్గించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. తులసి ఆకుల్లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఈ ప్రయోజనాలకు కారణం.