తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీవారి అన్నప్రసాదంలో మరో మార్పు చేసింది. జూలై 7 నుంచి రాత్రి భోజనంలోనూ మసాలా వడలు అందించనున్నారు. ప్రస్తుతం మధ్యాహ్నం 30,000-35,000 వడలు అందిస్తుండగా, రాత్రికి కూడా అదే సంఖ్యలో వడలు అందించనున్నారు. టిటిడి చైర్మన్ బి.ఆర్.నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.