శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కాళసముద్రం సమీపంలోని జాతీయ రహదారిపై ఒక లారీలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. క్షణాల్లో లారీ పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లారీలో ఉన్న ఫ్లైవుడ్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.