రన్నింగ్ రైలులో గర్భిణికి పురిటినొప్పులు వచ్చి టాయిలెట్లో ప్రసవించింది. శిశువు అక్కడికక్కడే మరణించగా, తల్లి రక్తపు మడుగులో పడిపోయింది. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించడంతో తల్లి ప్రాణాలు నిలిచాయి. గర్భిణులు, వృద్ధులు సుదూర ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.