ఒడిశాలో చిప్స్ ప్యాకెట్లో వచ్చిన బొమ్మ మింగి నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. చిప్స్ ప్యాకెట్లలోని బొమ్మలు చిన్నారులకు ప్రాణాంతకం కాగా, చిప్స్ అధికంగా తినడం వల్ల సోడియం స్థాయిలు పెరిగి బీపీ, ఊబకాయం, జువెనైల్ ఆర్థరైటిస్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.