పంటి నొప్పి అనేక ఆరోగ్య సమస్యలకు సంకేతం. దంతాల ఇన్ఫెక్షన్లు, చిగుళ్ల వ్యాధి వంటి కారణాలతో వచ్చే ఈ నొప్పికి వైద్యుల సలహా తప్పనిసరి. అయితే, అర్ధరాత్రి వంటి అత్యవసర సమయాల్లో నొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనం పొందేందుకు కొన్ని ఇంటి చిట్కాలున్నాయి. ఐస్ ప్యాక్‌లు, వెల్లుల్లి, లవంగం నూనె, ఉప్పు నీరు, పుదీనా ఆకులతో నొప్పి తగ్గించుకోవచ్చు.